బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన రష్మిక..రారా సామీ అంటూ అదిరిపోయే స్టెప్స్?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి రష్మిక హిందీలో తాను నటించిన డెబ్యూ మూవీ గుడ్ బై అక్టోబర్ 7వ తేదీ విడుదలైంది.

 Rashmika Made A Noise In The Bigg Boss House Rashmika , Bigg Boss House , Made-TeluguStop.com

ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుండగా ఈ సినిమాని మరింత ప్రమోట్ చేయడం కోసం చిత్రబృందం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే రష్మిక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హిందీ బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టారు.

ఇలా సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి రష్మిక, నీనా గుప్తా హాజరయ్యారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమానికి వీరిద్దరూ వెళ్ళగా సల్మాన్ ఖాన్ వీరికి సాదర స్వాగతం పలకడమే కాకుండా కంటెస్టెంట్లకు వీరిని పరిచయం చేసారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రష్మిక పెద్ద ఎత్తున సందడి చేశారు.ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ని ప్రశ్నిస్తూ తెలుగులో కొన్ని డైలాగ్స్ చెప్పమని అడగగా సల్మాన్ ఖాన్ తెలుగు డైలాగ్స్ చెప్పి సందడి చేశారు.

ఇకపోతే పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక బిగ్ బాస్ వేదికపై మరోసారి పుష్ప స్టెప్పులతో రచ్చ చేశారు.

ఈ సినిమాలో రష్మిక నటించిన రారా సామి అనే పాట ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే.అయితే బిగ్ బాస్ వేదికపై నటుడు సల్మాన్ ఖాన్ తో కలిసి మరోసారి ఈ పాటకు స్టెప్పులు వేసి అందరినీ అలరించారు ఇక వీరితో పాటు నీనా గుప్తా కూడా కాలు కదుపుతూ డాన్స్ చేయడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇక గుడ్ బాయ్ సినిమా అక్టోబర్ 7వ తేదీ ఎన్నో అంచనాల నడుమ విడుదలై ఎంతో మంచి విజయాన్ని అందుకుంది మొదటి రోజే ఈ సినిమా 1.20కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తుంది.ఇలా ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నటువంటి రష్మిక కాస్త సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం మాల్దీవుల వెకేషన్ లో ఎంజాయ్ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube