మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.మొదటి నాలుగు రోజుల్లో ఈ సినిమా దాదాపుగా 100 కోట్ల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమా లో చిరంజీవి తో పాటు మెగాస్టార్ సన్నిహితుడిగా పేరున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా లో సల్మాన్ ఖాన్ నటించినందుకు గాను పారితోషికం తీసుకోలేదట.
తాజాగా సినిమా సక్సెస్ మీట్ లో సల్మాన్ ఖాన్ యొక్క విషయం గురించి చిరంజీవి మాట్లాడుతూ.సల్మాన్ ఖాన్ కి పారితోషికం ఇచ్చి మేనేజర్ తో పంపించడం జరిగింది.
రూమ్ లోకి వెళ్ళిన మేనేజర్ ని సల్మాన్ ఖాన్ బూతులు తిడుతూ నేను చిరంజీవి గారి కోసం ఈ సినిమా చేశాను, పారితోషికం అక్కర్లేదు అంటూ తిట్టి అక్కడి నుంచి పంపించేసాడట.కేవలం నాపై అభిమానం తో సినిమా ను చేసిన సల్మాన్ ఖాన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు అంటే చిరంజీవి పేర్కొన్నారు.
గాడ్ ఫాదర్ సినిమా లో సల్మాన్ ఖాన్ పాత్ర లేకున్నా కూడా బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే.మరి కొందరు మాత్రం సినిమా కు హిందీ మార్కెట్ క్రియేట్ అవడం లో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి సల్మాన్ ఖాన్ ఉండడం వల్ల గాడ్ ఫాదర్ సినిమా కు ప్రమోషన్ పబ్లిసిటీ అయితే భారీగానే జరిగింది.తీరా సినిమా విడుదల అయిన తర్వాత ఆయన పాత్ర కు పెద్దగా ప్రాముఖ్యత లేదు అంటూ అభిమానులు ఉసూరుమంటున్నారు.
ఏదేమైతేనేం సల్మాన్ ఖాన్ తెలుగు సినిమా లో నటించాడు, ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం పట్ల తెలుగు ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.గాడ్ ఫాదర్ తో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా ఆయన నటిస్తే చూడాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు కోరిక వ్యక్తం చేస్తున్నారు.