విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.హ్యాపీ డేస్, ఫిదా వంటి సినిమాలు ఎన్నిసార్లు చుసిన ప్రేక్షకులకు విసుగు కానీ బోర్ కానీ కొట్టవు.
అలా ఆ సినిమాలను మలిచాడు.ఇక ఈయన లవ్ స్టోరీ సినిమాతో మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా కరోనా తర్వాత వచ్చిన మంచి హిట్ అందుకుని ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించింది.ఇక కమ్ముల ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేసాడు.
మరి ఇలాంటి హిట్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ హీరోను లైన్లో పెట్టాడు.కొన్ని నెలల క్రితం ధనుష్ హీరోగా నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు.
కానీ ఈ మధ్య ఈ సినిమా వాయిదా పడింది అంటూ వార్తలు వస్తున్నాయి.ప్రకటించి చాలా రోజులు అవుతున్న ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ బయటకు రాకపోవడంతో ఈ సినిమా వాయిదా పడినట్టే అని తెలిపారు.
ధనుష్ ఈ సినిమాను క్యాన్సిల్ చేసాడని.మరో డైరెక్టర్ తో సినిమా ప్రకటించ బోతున్నాడని వార్తలు వచ్చాయి.కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమా ఆగిపోలేదట.ఇంకా చర్చల దశలోనే ఉంది అని ప్రెజెంట్ ధనుష్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతనే శేఖర్ కమ్ముల సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉందట.
ఈ ఏడాది చివర్లో ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా రాబోతుందట.దీంతో కమ్ముల ఫ్యాన్స్ కు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా 1950 నాటి ఆంధ్రా, తమిళ్ నాడు మధ్య ఉన్న సంబంధాల మధ్య రాబోతుంది అని దీనిని భారీ పీరియాడిక్ డ్రామాగా చూపించ బోతున్నారు అంటూ తెలుస్తుంది.తమిళ్ నాడులో ఉండే తెలుగు కుర్రాడి పాత్రలో ధనుష్ కనిపిస్తాడట.ఈ సినిమాకు భారీ బడ్జెట్ మాత్రమే కాదు.ఎక్కువ సమయం కూడా కేటాయించాల్సి వస్తుందట.మరి ఈ ప్రాజెక్ట్ మళ్ళీ అధికారిక ప్రకటన కోసం అంతా వెయిట్ చేస్తున్నారు.ప్రెసెంట్ ధనుష్ తెలుగులోనే వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘సార్‘ అనే సినిమా చేస్తున్నాడు.
బైలింగ్వన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.







