టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ లు హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్.పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ లు హీరోయిన్ లుగా నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా విడుదల అయి కొన్ని నెలలుగా వస్తున్న కూడా ఈ సినిమా మేనియా ఇంకా తగ్గలేదు.</br
ప్రస్తుతం ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో ఇంకా ఈ సినిమా విడుదల కాలేదు.ఈ అక్టోబర్ 21వ తేదీన జపాన్ లో ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇక పోతే ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.ఈ పాటకు సామాన్యుల నుంచి పెద్ద పెద్ద సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు కూడా స్టెప్పులు వేశారు.
వ్యాప్తంగానే కాకుండా విదేశీయులు కూడా ఆ పాటకు స్టెప్పులు వేశారు అంటే పాట ఏ రేంజ్ లో హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఈ పాటకు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కూడా స్టెప్పులను ఇరగదీశారు.ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ఈ పాటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతోంది.అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియో నాటు నాటు పాటకు సంబంధించినది కాదు.
కానీ అచ్చం ఆ పాటలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఎలా అయితే స్టెప్పులు వేసారో అలాగే ఇద్దరు వ్యక్తులు వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.బ్లాక్ అండ్ వైట్ కాలంనాటి వీడియో ఒకటి నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల అవుతోంది.
ఆ వీడియోలోని స్టెప్పులు చూస్తే అచ్చం నాటు నాటు సాంగ్‌ను తలపిస్తున్నాయి.అంతేకాకుండా ఆ వీడియో కి నాటు నాటు సాంగ్ ను సెట్ చేశారు.ఆ వీడియో ఒకటి1:54 సెకండ్స్ నిడివి వుంది.







