అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.చౌలూరులో వైసీపీ నేత రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రామకృష్ణారెడ్డి మృతదేహాంతో మద్ధతుదారులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు.అంబేద్కర్ సర్కిల్ దగ్గర మృతదేహంతో రోడ్డుపై కార్యకర్తలు బైటాయించారు.
ఎమ్మెల్సీ ఇబ్బాల్ పై మద్ధతుదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.పోలీసులను అడ్డు పెట్టుకుని హత్యా రాజకీయాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్సీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
నిందితులను అరెస్ట్ చేసే వరకు మృతదేహాన్ని తరలించేది లేదని అనుచరులు తేల్చి చెబుతున్నారు.ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో ఆందోళనకారులకు అనంతపురం, సత్యసాయి జిల్లాల ఎస్పీలు సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.