ఏపీలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.ఇందుకు సంబంధించి ప్రతిపక్ష టీడీపీ కీలక ప్రకటన చేసింది.
ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా గాడు చిన్ని కుమారి లక్ష్మీ పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.
పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే చిన్ని కుమారి లక్ష్మీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసామన్నారు.ప్రస్తుతం జీవీఎంసీ రెండో వార్డు కార్పొరేటర్‌గా చిన్ని కుమారి లక్ష్మీ కొనసాగుతున్నారు.







