డిజిటల్ కరెన్సీపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది.త్వరలో ప్రయోగాత్మకంగా డిజిటల్ రూపీని విడుదల చేయనుంది.
ఈ క్రమంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.ఈ-రూపీకి సంబంధించిన పైలట్ లాంచ్ త్వరలోనే చేపడతామని తెలిపింది.
పరిమిత వాడకానికి పైలట్ బేసిస్‌లో ఈ డిజిటల్ రూపాయిని అందుబాటులో ఉంచుతామని పేర్కొంది.సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీపై కాన్సెప్ట్ నోటును విడుదల చేసింది.
ఎప్పటికప్పుడు ఈ డిజిటల్ రూపాయి ప్రత్యేక ఫీచర్లను, ప్రయోజనాలను ప్రజలకు ఆర్‌బీఐ తెలపనుంది.







