జ్ఞాన్వాపి మసీదు కేసులో తీర్పు వాయిదా పడింది.శివలింగం కార్బన్ డేటింగ్ పై వారణాసి జిల్లా కోర్టు విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది.
శివలింగంపై శాస్త్రీయ పరిశోధన జరపాలని అందుకు కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షం న్యాయవాది కోర్టును కోరిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ కేసుపై గత నెలలో శాస్త్రీయ దర్యాప్తు కోసం పిటిషన్ దాఖలు అయింది.
శివలింగం వయసును నిర్ధారించేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే కార్బన్ డేటింగ్ నిర్వహించాలని మహిళలు తన పిటిషన్ లో పేర్కొన్నారు.మరోవైపు ముస్లిం పక్షం శాస్త్రీయ విచారణపై అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఈనెల 11 లోపు అభ్యంతరాలు తెలియజేయాలని ముస్లిం వర్గానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు 11న ముస్లిం పిటిషనర్ల తరపు వాదనలు విననున్న వారణాసి కోర్టు.
అనంతరం తీర్పును వెలువరించనుంది.







