జ్ఞాన్వాపి పిటిషన్పై నేడు వారణాసి కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది.కార్బన్ డేటింగ్ పై జిల్లా న్యాయస్థానం కీలక ఉత్తర్వులు ఇవ్వనుంది.
ఈ నేపథ్యంలో వారణాసిలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడేందుకు నిషేధాజ్ఞలు విధించారు.
అయితే మసీదులో శృంగార గౌరీకి పూజలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో మసీదు ప్రాంగణంలోని శివలింగానికి కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలన్న హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేశారు.
శివలింగం ఏ కాలం నాటిదో తెలుసుకోవాల్సిన అవశ్యకత ఉందని, దీనిపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలని పిటిషన్ లో కోరారు.ఈ పిటిషన్ పై విచారణ జరపనున్న జిల్లా కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది.