T20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా బయలు దేరిన భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కింది. ముంబై ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లింది.
ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లిన క్రికెటర్లు, సపోర్టింగ్ స్టాఫ్ సూటు బూటు ధరించి క్రికెటర్లు ఓక వైపు ,మరో వైపు కోచ్ ద్రవిడ్తో స్టాఫ్ నిలబడి ఫోటోలకు ఫోజోలిచ్చారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్లో షేర్ చేసింది.
పిక్చర్ పర్ఫెక్ట్, వరల్డ్ కప్ ను సాధించడానికి వచ్చేస్తున్నాం అని బీసీసీఐ క్యాప్షన్ ఈ ఫోటోలకి జత చేసింది.మొత్తంగా 14 మంది ఆటగాళ్లు ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కి వెళ్లారు.
అయితే గాయం కారణంగా బుమ్రా వరల్డ్ కప్ నుంచి తప్పుకోగా అతని ప్లేస్లో బీసీసీఐ ఎవరినీ ఇంకా ఎంపిక చేయలేదు.
టీమ్ ఇండియా ఆటగాళ్లు t20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా కు వెళ్లే ముందు కొన్ని స్పెషల్స్ సెల్ఫీలతో ముంబై ఎయిర్ పోర్టులో హల్ చల్ చేశారు.
ఆస్ట్రేలియా విమానం ఎక్కే ముందు విరాట్ కోహ్లీ, హర్షల్ పటేల్, చాహల్ ముగ్గురు కలిసి సెల్ఫీలు దిగారు.బీసీసీఐ ఈ ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.
వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా వెళుతున్నామని ఈ ఫోటోలకు క్యాప్షన్ జత చేశారు.

టీమిండియా మిస్టర్ 360 బ్యాట్స్మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఫోటోలతో హల్చల్ చేశాడు.కెప్టెన్ రోహిత్ శర్మ పంత్ దినేష్ కార్తీక్ లతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.దినేష్ కార్తీక్ హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.టి20 వరల్డ్ కప్ ఆడేందుకు బయలుదేరిన టీమ్ ఇండియా ముంబై ఎయిర్ పోర్టులో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించారు.టి20 ప్రపంచ కప్ లో అక్టోబర్ 16 వ తేదీన శ్రీలంకతో నమీబియా మొదటి మ్యాచ్ ఆడనుంది.ఇక టీమిండియా విషయానికి వస్తే చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ తో అక్టోబర్ 23న మొదటి మ్యాచ్ ఆడనుంది.







