మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మరో షాక్ తగిలింది.శివసేన తిరుగుబాటు నేత, ప్రస్తుత సీఎం ఏక్ నాథ్ షిండేకు థాక్రే సోదరుడు జయదేవ్ థాక్రే పూర్తి మద్దతును ప్రకటించారు.
ఏక్ నాథ్ షిండేను ఒంటరిగా వదిలేయకూడదని… అందరూ ఆయనకు మద్దతుగా నిలవాలని జయదేవ్ థాక్రే చెప్పారు.పేదలు, రైతుల కోసం షిండే పని చేస్తున్నారని, షిండే కూడా చాలా కష్టపడి పని చేస్తారని చెప్పారు.
రాష్ట్రంలో మళ్లీ షిండే ప్రభుత్వమే రావాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.ఎన్నికలు రావాలని, మళ్లీ షిండే అధికారాన్ని చేపట్టాలని కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.







