ప్రస్తుతం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జమ్ము కాశ్మీర్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.పర్యటనలో భాగంగా బుధవారం అమిత్ షా ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఆ ప్రాంతం దగ్గరలో ఉన్న ఒక మసీదు లో నుంచి అజాన్ చెబుతున్న శబ్దం వినబడింది.అప్పుడు వెంటనే అమిత్ షా మధ్యలోనే తన ప్రసంగాన్ని ఐదు నిమిషాల పాటు నిలిపివేసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు.
30 నిమిషాల పాటు జరిగిన ఈ ప్రసంగంలో ఇలా అజాన్ కోసం అమిత్ షా ఐదు నిమిషాల సమయాన్ని కేటాయించడం విశేషం.అమిత్ షా మూడు రోజుల జమ్మూ కాశ్మీర్ పర్యటనలో బుధవారం భారముల్లాలోని సౌఖత్ అలీ స్టేడియంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.ర్యాలీ కి వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుండగా దగ్గరలో ఉన్న మసీద్ నుంచి ఆయనకు శబ్దం వినపడి, ఆ శబ్దం ఏంటని స్టేజి మీద ఉన్న భారతీయ జనతా పార్టీ నేతలను అడిగి తెలుసుకుని, ఆ శబ్దం అజాన్ చెబుతున్న శబ్దం అని తెలుసుకుని వెంటనే తన ప్రసన్నంగాన్ని ఐదు నిమిషాల పాటు నిలిపివేశారు.

అప్పుడు వెంటనే ర్యాలీలో ఉన్న ప్రజలు అమిత్ షాకు జేజేలు పలికారు.అమిత్ షా జిందాబాద్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.అజాన్ చెప్పడం అయిపోయాక కూడా ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? లేదా అని గట్టిగా చెప్పండి.ఇప్పుడు నేను మాట్లాడొచ్చా? అని ర్యాలీలో ఉన్న ప్రజలను అమీషా ప్రశ్నించారు.అమిత్ షా ఈ ర్యాలీకి ముందుగా నిర్ణయించిన సమయానికి కాకుండా కాస్త ఆలస్యంగా వచ్చారు.ఆ ర్యాలీలో పాల్గొనడానికి ఉదయమే ఆయన అక్కడికి చేరుకోవాల్సి ఉండగా ఆయన సాయంత్రం నాటికి చేరుకున్నారు.
ఇలా జరగడం వల్ల అమిత్ షా మాత్రమే ప్రసంగించారు.మిగతా నాయకులెవరు ర్యాలీలో మాట్లాడలేదు.







