ఢిల్లీలో టీఆర్ఎస్ నేతల బృందం పర్యటన కొనసాగుతోంది.దీనిలో భాగంగా మరి కాసేపట్లో ఎన్నికల సంఘం అధికారితో నేతలు భేటీ కానున్నారు.
టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మాన కాపీని ఈసీకి అందించనున్నారు.అదేవిధంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వివరాలను కూడా టిఆర్ఎస్ నేతలు ఈసీకి అందించనున్నారు.
ఈ క్రమంలో టిఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితిగా గుర్తించాలని ఈసీకి విజ్ఞప్తి చేయనున్నారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మారుస్తూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.







