ఈ మధ్య కాలంలో శాశ్వత నివాసాల పై పలు దేశాలు విదేశీయులకు ఓ క్లారిటీ ఇస్తున్నాయి.మొన్నటి వరకూ శాశ్వత హోదా కల్పించేందుకు లక్ష కొరీలు పెడుతూ వచ్చిన పలు దేశాలు నిపుణులైన ప్రవాసుల కోసం వారి నిభంధనలలో మార్పులు చేర్పులు చేస్తూ కీలకనిర్ణయాలు తీసుకుంటున్నాయి.
కెనడా దేశం ఈ విషయంలో ఒకడుగు ముందుందనే చెప్పాలి.గతంలో భారతీయ విద్యార్ధులను ఆకర్షించే క్రమంలో విదేశీ విద్యార్ధులు చదువు అయిన తరువాత రెండేళ్ళ పాటు కెనడాలో ఉంటూ ఉద్యోగం సంపాదించుకోవచ్చునని, ఉద్యోగం పొందిన తరువాత వరుసగా ఐదేళ్ళు కెనడాలో ఉంటే వారికి శాశ్వత నివాస హోదా కల్పిస్తామని తెలిపింది.
కాగా తాజాగా విదేశీ విద్యార్ధులకు ఆకర్షించే క్రమంలో మరో కీలక ప్రకటన చేసింది కెనడా ప్రభుత్వం.కెనడాలో ఉంటున్న విదేశీ వైద్యులు శాశ్వత నివాసానికి అర్హులు అవుతారని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది.
ఎక్ష్ప్రెస్స్ ఎంట్రీ ద్వారా విదేశీ వైద్యులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తోంది.గతంలో ఇదే పధకం ద్వారా విదేశాలలో పనిచేసే వైద్యులు ఎవరైనా సరే ఏడాది పాటు అనుభవం ఉంటే చాలు వారు శాశ్వత నివాసానికి అర్హులుగా ఉండేవారు అయితే కెనడాలో పనిచేస్తున్న వైద్యులను ఇందులో పరిగణలోకి తీసుకునేవారు కాదు కానీ.

ఇప్పుడు చేసిన మార్పులలో కెనడాలో పనిచేస్తున్న విదేశీ వైద్యులు కూడా శాశ్వత నివాసం పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించింది కెనడా.గత కొంత కాలంగా కెనడా ప్రభుత్వం విదేశీ నిపుణుల లేమి తో ఇబ్బందులు పడుతోంది.కరోనా సమయంలో మరింత సమస్యలు ఎదుర్కొంది.అదే సమయంలో అమెరికా నిపుణులను అనుమతించక పోవడంతో ఆ పరిస్థితిని అదునుగా చేసుకుని విదేశీ నిపుణులు, విద్యార్ధులను ఆకర్షించడానికి తమ వలస విధానంలో, శాశ్వత నివాస హక్కులలో భారీ మార్పులు చేసింది.
దాంతో అమెరికా వైపు వెళ్ళే భారతీయులు కెనడా ఇస్తున్న ఆఫర్ల కు ఆకర్షితులై కెనడా వెళ్లేందుకు ప్రాధాన్యతను ఇస్తున్నారు.తాజాగా విదేశీ వైద్యులకు కూడా శాశ్వత హోదా విషయంలో చేసిన మార్పులు ఎంతో మంది వైద్యులకు మేలు చేకూర్చనుందని అంటున్నారు నిపుణులు.







