సోనాల్ చౌహన్.పెద్దగా ఆఫర్లు అందుకోలేక పోయిన ఈ బ్యూటీ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు.ఈమె బాలయ్యతో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకుంది.అయితే ఈమెకు పెద్దగా అవకాశం అవకాశాలు రాలేదు.అడపా దడపా వచ్చిన నటిగా నిరూపించుకునే అవకాశాలు మాత్రం అందుకోలేక రేసులో వెనుకబడి పోయింది.ఈమెతో పాటు వచ్చిన నటీమణులే కాకుండా ఈమె తర్వాత వచ్చిన వారు కూడా స్టార్ స్టేటస్ అందుకున్నారు.
కానీ సోనాల్ కు మాత్రం ఆశించిన అవకాశాలు రాక తనకంటూ నటిగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.ఇక ఎన్నో రోజుల తర్వాత ఈమె వెయిటింగ్ కు ఎండ్ కార్ట్ పడింది.
నటిగా తనని తాను నిరూపించు కునేందుకు ఒక ఛాన్స్ దొరికింది.ఇటీవలే ఎఫ్ 3 సినిమాలో చేసి ఆకట్టుకున్న ఈ భామ ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అక్కినేని నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాతో దసరాకు అలరించడానికి సోనాల్ కూడా వచ్చింది.
వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించిన ఘోస్ట్ సినిమా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కింది.ఇక ఈ సినిమాలో సోనాల్ ఇంటర్ పోల్ ఆఫీసర్ ప్రియా పాత్రలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెస్మరైజ్ చేసింది అనే చెప్పాలి.
సాహసోపేతమైన యాక్షన్ రోల్ కోసం ప్రాణం పెట్టి చేసిందని ప్రశంసలు దక్కుతున్నాయి.ఎవ్వరూ చేయలేని రోల్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు లేడీ యాక్షన్ ను చూపించింది.

దీంతో ఈ అమ్మడిపై ప్రశంసల జల్లు కురుస్తుంది.మహిళా నటీమణులలో కొందరు మాత్రమే ఇలా చేయగలరు అని ప్రశంసలు దక్కించుకుంటుంది.తన శ్రమ, పట్టుదల మొత్తం తెరపై కనిపిస్తుంది.మరి ఈ ప్రశంసలతో సోనాల్ చాలా ఆనందంగా ఉంది అని తెలుస్తుంది.అలాగే నాగ్ పెయిర్ గా కూడా పర్ఫెక్ట్ అనిపించింది.మరి ఈమె మరింత ఆనందం పొందాలంటే వరుస ఛాన్సులు ఛాన్సులు అందుకోవాల్సిందే.







