మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత ఎన్నో అంచనాల నడుమ మోహన్ రాజా దర్శకత్వంలో నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.విజయదశమి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇక ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలోనూ అలాగే సినిమా విషయంలోనూ మెగాస్టార్ చిరంజీవి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇకపోతే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకుల అంచనాలను చేరుకుందని చెప్పాలి.

ఇకపోతే ఈ సినిమాకి గాడ్ ఫాదర్ అనే టైటిల్ పెట్టడం వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టారు పాటల రచయిత అనంత శ్రీరామ్.ఈ సినిమా కోసం గాడ్ ఫాదర్ టైటిల్ ఫిక్స్ చేసినది సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ అంటూ ఈయన వెల్లడించారు.ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెట్టాలని ఆలోచనలో చిత్ర బృందం ఉండగా వెంటనే గాడ్ ఫాదర్ అయితే ఈ సినిమాకి అద్భుతంగా ఉంటుందంటూ సలహా ఇచ్చారని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాకి ఇదే టైటిల్ పెట్టాలని ఈయన చిత్ర బృందాన్ని ఒప్పించారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు గాడ్ ఫాదర్ టైటిల్ కూడా బాగుందన్న నేపథ్యంలో చిత్ర బృందం ఈ సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేశారని అనంత శ్రీరామ్ పేర్కొన్నారు.ఇక ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.
మలయాళ సూపర్ హిట్ చిత్రం లూసిఫర్ చిత్రానికి రీమేక్ గా వచ్చినటువంటి ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి.ఇక ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ సెలబ్రెటీలు నటించడం సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అయింది.







