ఆదిపురుష్ టీజర్ ట్రోల్స్ పై స్పందించిన డైరెక్టర్.. ఏం చెప్పారంటే?

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.సాధారణంగా ఏదైనా సినిమా టీజర్ విడుదలైతే ఆ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతాయనే సంగతి తెలిసిందే.

 Director Om Raut Reaction About Adipurush Movie Trolls Details Here Goes Viral-TeluguStop.com

అయితే ఆదిపురుష్ సినిమాకు మాత్రం టీజర్ విడుదలైన తర్వాత అంచనాలు తగ్గాయి.అయితే వైరల్ అవుతున్న నెగిటివ్ కామెంట్ల గురించి దర్శకుడు ఓం రౌత్ స్పందించారు.

ఆదిపురుష్ మూవీ టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమా గురించి జరుగుతున్న ట్రోలింగ్ ను చూసి నేను ధైర్యం కోల్పోయిన మాట వాస్తవం అని ఆయన అన్నారు.అయితే ట్రోలింగ్ విషయంలో నేనేమీ పెద్దగా ఆశ్చర్యానికి గురి కాలేదని ఆయన కామెంట్లు చేశారు.

ఆదిపురుష్ సినిమాను వెండితెర కోసం తీశామని థియేటర్ లో తెర సైజ్ పరిమాణాన్ని మరీ మొబైల్ స్థాయికి తగ్గించకూడదని ఓం రౌత్ వెల్లడించారు.

అలా చేస్తే అసలు బాగోదని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

ఆదిపురుష్ ను అందరికీ చేరువ చేయాలనే ఆలోచనతోనే యూట్యూబ్ ఆడియన్స్ కోసం ఈ సినిమా టీజర్ ను అందుబాటులోకి తెచ్చామని ఆయన చెప్పుకొచ్చారు.ఆదిపురుష్ సినిమాను సినిమాలను అరుదుగా చూసే వాళ్ల కోసం తీయలేదని ఓం రౌత్ తెలిపారు.

థియేటర్ కు దూరమైన వాళ్లు, మారుమూల ప్రాంతాలలో ఉండేవాళ్లను థియేటర్ కు రప్పించాలని ఈ సినిమాను తెరకెక్కించామని ఓం రౌత్ చెప్పుకొచ్చారు.

ఆదిపురుష్ మూవీ రామాయణంకు సంబంధించిన కథతో తెరకెక్కిందని తర్వాత జనరేషన్ ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను తీస్తున్నామని ఓం రౌత్ కామెంట్లు చేశారు.తర్వాత జనరేషన్ కు కూడా ఈ సినిమాను అర్థమయ్యే భాషలో చెప్పాలనే ఆలోచనతో త్రీడీ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఈ సినిమాను తెరకెక్కించామని ఆయన అన్నారు.ఓం రౌత్ కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube