లెమ‌న్ పీల్ టీ.. రోజుకు ఒక క‌ప్పు తాగితే ఆ జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు!

టీలలో ఎన్నో రకాలు ఉన్నాయి.వాటిలో కొన్ని చక్కటి రుచిని కలిగి ఉంటే.

 Wonderful Benefits Of Lemon Peel Tea! Lemon Peel Tea, Lemon Peel Tea Benefits, L-TeluguStop.com

మరికొన్ని ఆరోగ్యానికి బోలెడన్ని లాభాల‌ను అందిస్తుంటాయి.అయితే కొన్ని టీలు మాత్రం రుచిగా ఉండడమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయి.

అటువంటి వాటిలో లెవెన్ పీల్ టీ ఒక‌టి.మీరు విన్నది నిజమే.

నిమ్మ తొక్కలతో టీ ని తయారు చేసుకోవచ్చు.లెమన్ పీల్ టీ చక్కటి రుచితో పాటు అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

మరి ఇంతకీ లెమన్ పీల్ టీని ఎలా తయారు చేసుకోవాలి.? అసలు అది అందించే ఆరోగ్య లాభాలు ఏంటి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందు ఒక నిమ్మ పండును తీసుకుని నీటిలో శుభ్రంగా కడగాలి.

ఇలా కడిగిన నిమ్మపండును పై తొక్క వచ్చేలా తురుముకుని పెట్టుకోవాలి.అలాగే అర అంగుళం అల్లం ముక్క తీసుకుని తొక్క తొలగించి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హిట్ అవగానే అందులో నిమ్మ తొక్కల తురుము, అల్లం తురుము వేసుకుని ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఆ తర్వాత మరిగించిన వాటర్‌ను ఫిల్టర్ చేసుకుని రుచికి సరిపడా తేనెను కలిపితే లెమన్ పీల్ టీ సిద్ధమయినట్టే.రోజుకు ఒక కప్పు చొప్పున ప్రతి రోజూ ఈ టీ తీసుకుంటే ఓరల్ హెల్త్ మెరుగుపడుతుంది.

దంతాలు మరియు చిగుళ్లు ఆరోగ్యంగా మారతాయి.నోటి నుంచి దుర్వాసన రావడం తగ్గుముఖం పడుతుంది.

Telugu Tips, Latest, Lemon Peel, Lemonpeel, Lemon Peel Tea-Telugu Health Tips

అలాగే లెమన్ పీల్ టీ తీసుకోవడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.దాంతో సీజ‌న‌ల్ వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది.మెటబాలిజం రేటును పెంచి వేగంగా బ‌రువును త‌గ్గించ‌డంలో ఈ టీ గ్రేట్‌గా సహాయపడుతుంది.అంతేకాదు లెమన్ పీల్ టీను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఒత్తిడి డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.మరియు వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్‌ సైతం తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube