ప్రభాస్ నటించిన ఆదిపురుష్ టీజర్ కు సంబంధించి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నా ఈ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్న సంగతి తెలిసిందే.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆదిపురుష్ టీజర్ మెప్పించకపోయినా ప్రభాస్ అభిమానులను మాత్రం ఈ టీజర్ ఆకట్టుకుంది.
అయితే ఆదిపురుష్ టీజర్ లోని కొన్ని షాట్స్ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ కాపీ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
బాహుబలి సినిమాలోని కొన్ని షాట్స్ నుంచి ఆదిపురుష్ కాపీ చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఆదిపురుష్ పోస్టర్ సైతం గతంలో రామ్ చరణ్ రాముని పాత్రలో ఉన్న ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను పోలి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆదిపురుష్ టీజర్ వీడియో కాపీ షాట్స్ కు సంబంధించిన వీడియోలను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.
దర్శకుడు ఓం రౌత్ ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
మరోవైపు 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు ఆ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందో లేదో చూడాల్సి ఉంది.
ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాపై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం వల్ల అంచనాలు తగ్గుతున్నాయని సినిమా విడుదలైన తర్వాత ఈ అభిప్రాయం మారుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి ఆదిపురుష్ టీజర్ పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ గత సినిమాలు నెగిటివ్ టాక్ తో మొదలైనా భారీగానే కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవుతుందని ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.సాహో, రాధేశ్యామ్ సక్సెస్ సాధించని నేపథ్యంలో ఆదిపురుష్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.టీసిరీస్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.







