గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ లో టాప్ 3 మిస్టేక్స్ ఇవే!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న తాజా చిత్రం గాడ్ ఫాదర్.ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన విషయం తెలిసిందే.

 Megastar God Father Title Song 3 Mistakes , Chiranjeevi , God Father , Megastar-TeluguStop.com

ఈ చిత్రం అక్టోబర్ 5 న దసరా పండుగ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.ఇందులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో సత్యదేవ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

విడుదల తేదీకి మరికొద్ది గంటలే సమయం ఉండడంతో చిత్ర బంధం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేసింది.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా చిత్ర బృందం ఈ గాడ్ ఫాదర్ సినిమా టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది.

ఈ టైటిల్ సాంగ్ లో సల్మాన్ ఖాన్ కూడా కనిపించనున్నారు.అయితే ఈ సాంగ్ కు మెగా అభిమానుల నుంచి భారీగా స్పందన లభిస్తుండగా కొన్ని వర్గాల నుంచి నెగిటివ్ గా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

గాడ్ ఫాదర్ టైటిల్ సాంగ్ లో మూడు మిస్టేక్స్ ఉన్నాయి అంటూ ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

టైటిల్ సాంగ్ ని చూసిన నెటిజెన్స్ అందులో కొన్ని తప్పులు ఉన్నాయి అని అంటున్నారు.తప్పులు ఏంటి అన్న విషయానికి వస్తే.మొదటిది మ్యూజిక్ బాగాలేదని, రెండవది లిరిక్స్ కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయని, అలాగే ఈ పాట చిరంజీవి రేంజ్ కాదు అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఈ సినిమా టైటిల్ సాంగ్ పై పాజిటివ్ కామెంట్స్ ఎన్ని వినిపిస్తున్నాయో నెగటివ్ కామెంట్స్ కూడా అదే రేంజ్ లో వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube