ఆర్ధిక ఇబ్బందులు కావొచ్చు.కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకునే ఆలోచన కావొచ్చు.
ఏదైతేనేం.భారతీయులు ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని విదేశాలకు వెళ్తున్నారు.
కానీ అక్కడ అడుగుపెడితే కానీ అసలు విషయం తెలియదు.అవసరంలో వున్నవారిని ఆదుకుంటామని చెప్పి టూరిస్ట్ వీసా పేరిట వారిని ట్రావెల్ ఏజెంట్లు తరలించే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
గడువు ముగిసిన తర్వాత వీరు అక్కడే ఉండిపోతున్నారు.అక్కడి చట్టాలు కఠినంగా ఉండటంతో వీసాలు, పాస్‌పోర్టులు లేనివారు రహస్యంగా జీవిస్తున్నారు.
భారతీయ కార్మికుల భయం, బలహీనతలను ఆసరాగా తీసుకొని యజమానులు, ట్రావెల్ ఏజెంట్లు వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు.
ఇంకొందరైతే విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికిపోయి.
జైల్లో గడుపుతున్నారు.కనీసం వీరి క్షేమ సమాచారం కూడా కుటుంబ సభ్యులకు తెలియడం లేదు.
అలాంటి కోవలోనే హర్యానాలో ఓ ఘటన జరిగింది.రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఆస్ట్రియాలోని హంగేరీలో ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడిని 20 ఏళ్ల నితిన్‌గా గుర్తించారు.ఈ కేసుకు సంబంధించి ఓ ట్రావెల్ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇతను నితిన్‌ను ఆస్ట్రియాకు పంపుతానని ఒప్పందం చేసుకున్నాడు.కానీ అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ నితిన్ అదృశ్యమై, కొన్ని రోజుల తర్వాత ప్రాణాలు కోల్పోయాడు.
సదరు ట్రావెట్ ఏజెంట్‌ను యమునా నగర్‌కు చెందిన సుఖ్వీందర్ సింగ్‌గా గుర్తించారు.ఇతనితో పాటు కుల్బీర్ సింగ్, సత్వంత్ సింగ్‌లపై ఇమ్మిగ్రేషన్ చట్టంలోని 10, 24 సెక్షన్లతో పాటు ఐపీసీలోని 406, 420, 370, 384, 120బీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
మృతుడి తండ్రి సుఖ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ.నితిన్‌ను విదేశాలకు పంపాలని తాము భావించామని, దీనిలో భాగంగా సుఖ్వీందర్ సింగ్ అనే వ్యక్తితో సంప్రదించినట్లు తెలిపారు.అనంతరం నితిన్‌ను తాను ఆస్ట్రియాకు పంపిస్తానని సుఖ్వీందర్ సింగ్ హామీ ఇచ్చాడని… ఇందుకు గాను రూ.12 లక్షలు కోరాడని ఆయన తెలిపారు.
దీంతో ఆగస్ట్ 9న ఏజెంట్ తనను లక్ష రూపాయలు తీసుకుని అమృత్‌సర్‌కు రమ్మని చెప్పాడని.ఆపై నితిన్‌ను దుబాయ్, సెర్బియా మీదుగా హంగేరీకి పంపించినట్లు సుఖ్‌బీర్ వెల్లడించారు.అయితే ఆగస్ట్ 24న సుఖ్వీందర్ తనకు ఫోన్ చేసి.నితిన్ హంగేరీలో వున్నాడని, అతనిని ఆస్ట్రియా పంపేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని కోరినట్లు సుఖ్‌బీర్ చెప్పారు.దీంతో అతను చెప్పినట్లు డబ్బు ముట్టజెప్పానని… కానీ ఆ తర్వాత నితిన్ నుంచి ఎలాంటి కమ్యూనికేషన్ లేదని.
దీనిపై ఆరా తీస్తే ఏజెంట్లు తమను తప్పుదోవ పట్టించారని సుఖ్‌బీర్ ఆవేదన వ్యక్తం చేశారు.దీంతో పోర్చుగల్‌లో వున్న తన మేనల్లుడు అమన్‌ని నితిన్ జాడ కనుక్కోవాల్సిందిగా కోరానని.
అతను హంగేరీకి వెళ్లి ఆరా తీయగా తన కుమారుడు మరణించినట్లు తెలిసిందని సుఖ్‌బీర్ పేర్కొన్నారు.