ప్రభాస్ ఆది పురుష్ లుక్ పై బండ్ల గణేష్ కామెంట్స్.. ఏకిపారేస్తున్న యాంటీ ఫ్యాన్స్?

బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు.వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టు పెట్టిన క్షణాల్లో వైరల్ అవుతుంది.

 Bandla Ganesh Comments On Prabhas Adipurush Look Details, Bandla Ganesh, Bandla-TeluguStop.com

ఇకపోతే ఎలివేషన్ ఇవ్వడంలో బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి.పవన్ కళ్యాణ్ గురించి ఈయనని అడిగితే ఈయనకు ఏదో పూనకం వచ్చినట్టు ఊగిపోతూ పవన్ కళ్యాణ్ పై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.

ఇక ఆయనను ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంటారు.

ఇదిలా ఉండగా తాజాగా బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ ఆది పురుష్ లుక్ పై స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన ప్రభాస్ ఫోటోని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.కళ్ళల్లో రాజసం.మీసంలో పౌరుషం అచ్చం శ్రీరామచంద్ర మహా ప్రభులా ఉన్న ప్రభాస్ అంటూ ఈయన ప్రభాస్ లుక్ పై కామెంట్ చేశారు.ఈ క్రమంలోనే ఈ పోస్ట్ వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయగా యాంటీ ఫ్యాన్స్ మాత్రం బండ్ల గణేష్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

Telugu Adipurush, Bandla Ganesh, Bandlaganesh, Prabhas Fans-Movie

ప్రభాస్ ఆది పురుష్ లుక్ ఏ మాత్రం బాగాలేదని ముఖ్యంగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ కార్టూన్ వీడియోల ఉందంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ఉన్నారు.ఇలా కార్టూన్ సినిమాని తలపిస్తుంటే మీకు పౌరుషం రాజసం ఎక్కడ కనిపిస్తుంది అంటూ పెద్ద ఎత్తున బండ్ల గణేష్ పై యాంటీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.మొత్తానికి బండ్ల గణేష్ ప్రభాస్ లుక్ పై స్పందిస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube