హైదరాబాదులో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టయింది.ఎల్బీనగర్ లో తనిఖీలు నిర్వహించిన ఎస్ఓటి పోలీసులు 900 కేజీల నిషేధిత గంజాయిని పట్టుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.రెండు కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేశామన్న ఎస్వోటీ పోలీసులు.వారిని రిమాండ్ గా తరలించనున్నట్లు పేర్కొన్నారు.ఎక్కడైనా నిషేధిత గంజాయి విక్రయాలు జరిపినా, అక్రమంగా తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







