ఆదిపురుష్ గ్రాఫిక్స్ కంటే ఆ సీరియళ్ల గ్రాఫిక్స్ బెటర్..దారుణం అంటూ?

బాహుబలి, బాహుబలి2 సినిమాలు పరిమిత బడ్జెట్ తో తెరకెక్కి కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో ప్రస్తుతం చాలామంది స్టార్ డైరెక్టర్లు భారీ బడ్జెట్ సినిమాలపై దృష్టి పెడుతున్నారు.బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రభాస్ ను రాముని పాత్రలో చూపిస్తూ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించగా తాజాగా విడుదలైన ఆదిపురుష్ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కంటే నెగిటివ్ రెస్పాన్స్ ఎక్కువగా వస్తోంది.

 Negative Comments About Adipurush Serial Graphis Details Viral Adipurush, Adi-TeluguStop.com

ఆదిపురుష్ గ్రాఫిక్స్ కంటే హరిహర మహాదేవ, నాగిని సీరియల్స్ గ్రాఫిక్స్ ఎక్కువ క్వాలిటీతో ఉంటాయంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.యానిమేషన్ సినిమాను తలపించేలా ఆదిపురుష్ గ్రాఫిక్స్ సీన్లు ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి.

ప్రభాస్ రాముడి లుక్ విషయంలో కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తుండటం గమనార్హం.ప్రభాస్ బరువు తగ్గి రాముడి పాత్రలో నటించి ఉంటే బాగుండేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.2023 సంక్రాంతి పండుగకు ఆదిపురుష్ సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఆ సినిమాకు నష్టమే తప్ప లాభం ఉండదని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.మాస్ సినిమాలకు పోటీగా ఆదిపురుష్ సినిమాను విడుదల చేస్తే ఆదిపురుష్ కలెక్షన్లపై ఆ ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

బడ్జెట్ కు తగిన స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుందా అనే ప్రశ్నకు కూడా కాదనే సమాధానం వినిపిస్తోంది.

సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత ప్రభాస్ ఇలాంటి ప్రాజెక్ట్ కు ఓకే చెప్పి తప్పు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బాహుబలి సినిమాతో పోల్చి చూస్తే ఆదిపురుష్ నచ్చదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.ఆదిపురుష్ పై మరీ అంచనాలు పెట్టుకోవడం కరెక్ట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఆదిపురుష్ పై వస్తున్న నెగిటివ్ కామెంట్లు కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube