అన్‌ స్టాపబుల్‌ 2 లో ఈసారి 'ఆ' విషయాలనే హైలైట్‌ చేస్తారట

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేస్తున్న అన్ స్టాపబుల్‌ సీజన్ 2 ప్రారంభానికి సిద్ధమైంది.ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్న సీజన్ 2 సంబంధించిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Balakrishna Unstoppable Show Season 2 Interesting Update Balakrishna , Unstoppa-TeluguStop.com

రేపు ఈ షో కు సంబంధించిన ప్రెస్ మీట్ విజయవాడ లో జరగబోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే మొదటి ఎపిసోడ్ చంద్రబాబు నాయుడు లోకేష్ లపై చిత్రీకరించడం జరిగింది.

రెండవ ఎపిసోడ్ ఎవరి తో ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.నందమూరి బాలకృష్ణ కచ్చితం గా సీజన్ 2 తో కూడా ఆకట్టుకుంటాడని ఆహా వర్గాల వారు చెప్తున్నారు.

గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ కచ్చితం గా ఏదైనా ఆకర్షణీయమైన ఎలిమెంట్‌ ఉండే అవకాశం ఉందని మొదటి నుండి కూడా అభిమానులు అంచనాలు పెంచుకొని ఉన్నారు.

తాజాగా ఆహా టీం వారు చెబుతున్న దాని ప్రకారం గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో కాస్త వివాదాస్పద అంశాలను టచ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.

గత సీజన్‌ లో అస్సలు వివాదాల జోలికి వెళ్లకుండా సరదాగా ముచ్చట్లు.ఆటల తో టాక్ షో కొనసాగింది.

కానీ గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ విభిన్నంగా ఉండాలనే ఉద్దేశం తో బాలకృష్ణ తో వచ్చిన గిస్ట్‌ ల యొక్క వివాదాస్పద వ్యాఖ్యలు మరియు వివాదాస్పద చర్యల గురించి మాట్లాడింపజేసి మంచి గుర్తింపును మరియు మంచి రేటింగ్ ని దక్కించుకోవాలని ఆహా ఓటీటీ వారు భావిస్తున్నారట.ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే గోపీచంద్ మల్లినేని దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్నాడు.

ఆ సినిమా షూటింగ్ చివరి దశ లో ఉంది.ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఈయన ఒక సినిమా ను చేయాల్సి ఉంది.

ఈయన సినిమాల కంటే కూడా ఎక్కువగా ప్రస్తుతం అన్‌ స్టాపబుల్‌ సీజన్ 2 కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారట.ఈ విషయాన్ని స్వయంగా ఆయన సన్నిహితులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube