పుష్పకు నష్టాలు రాధేశ్యామ్ కు లాభాలట.. తేజ సంచలన వ్యాఖ్యలు వైరల్!

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ టికెట్ రేట్లను తగ్గించిన సమయంలో తక్కువ టికెట్ రేట్ల వల్ల కొన్ని పెద్ద సినిమాల నిర్మాతలు ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.ఈ ఏడాది రాధేశ్యామ్ సినిమా నుంచి పెరిగిన టికెట్ రేట్లు అమలులోకి వచ్చాయి.

 Teja Sensational Comments Goes Viral In Social Media Details, Director Teja, Dir-TeluguStop.com

అదే సమయంలో జగన్ సర్కార్ అత్యంత భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లను మరింత పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం గమనార్హం.

దర్శకుడు తేజ మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

రాధేశ్యామ్ సినిమా కొన్ని ప్రాంతాలలో లాభాలను తెచ్చిపెట్టిందని పుష్ప సినిమా కొన్ని ప్రాంతాలలో నష్టాలను తెచ్చిపెట్టిందని తేజ తెలిపారు.ముంబైలో పుష్ప సినిమా ఆడిందని ముంబైలో సినిమా సక్సెస్ సాధిస్తే దేశమంతా సక్సెస్ సాధించినట్టే అని చాలామంది అనుకుంటారని తేజ పరోక్షంగా చెప్పుకొచ్చారు.

ఆంధ్రాలో మాకు తెలిసిన వాళ్ల థియేటర్ లో పుష్ప రిలీజైందని అయితే పెట్టుబడితో పోల్చి చూస్తే కలెక్షన్లు తక్కువగా వచ్చాయని తేజ తెలిపారు.

పుష్ప సినిమాతో పోల్చి చూస్తే రాధేశ్యామ్ సినిమా మెరుగైన కలెక్షన్లను రాబట్టిందని ఆచార్య సినిమాకు మాత్రం నష్టాలు వచ్చాయని తేజ చెప్పుకొచ్చారు.

Telugu Acharya, Ap Ticket Rates, Teja, Jagan, Pushpa, Radheshyam, Sensational-Mo

టికెట్ రేట్ల వల్లే పుష్ప సినిమా హిట్టైనా ఏపీలో నష్టాలు వస్తే పెరిగిన టికెట్ రేట్లు రాధేశ్యామ్ కు ప్లస్ అయ్యాయి.రాధేశ్యామ్ సక్సెస్ సాధించకపోయినా పెంచిన టికెట్ రేట్లు ఆ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయ్యాయి.

మరోవైపు డైరెక్టర్ తేజకు ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేదు.తేజ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.తేజ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.ఈతరం ప్రేక్షకులలో కూడా దర్శకుడు తేజను అభిమానించే అభిమానులు ఉన్నారు.

తేజకు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube