ఏపీ తెలుగుదేశం పార్టీ నేతల తీరుపై మంత్రి మేరుగ నాగార్జున తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టిడిపి నేతలకు రాజ్యాంగం వర్తించదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
చింతకాయల విజయ్ సోషల్ మీడియా అరాచక వాది అని ఆరోపించారు.ఆయన పెట్టే పోస్టులు దారుణంగా ఉన్నాయని.
కానీ పోలీసులు విజయ్ ఇంటికి వెళ్తే మాత్రం గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు.సిఐడి పోలీసులు దొంగని పట్టుకోవడానికి వెళ్తే తప్పేంటి అని ప్రశ్నించారు.
మహిళలపై అభ్యంతరకర పోస్టులను సమర్థిస్తున్నారా అన్న ఆయన.చట్టం తన పని తాను చేసుకోపోతుందని స్పష్టం చేశారు.







