ప్రజల ముందు మోకరిల్లి క్షమాపణ చెప్పిన మోదీ ఎందుకంటే..?

ప్రధాని నరేంద్ర మోదీ శక్రవారం రాజస్తాన్‌లో సిరోహి జిల్లాలోని అబురోడ్‌ వద్ద జరగాల్సిన ర్యాలీ సభా వేదికకు రావాల్సి ఉండేది.కానీ ఆయన ఆలస్యంగా రావడంతో ఆ సభలో ప్రసంగించలేకపోయారు.

 Modi Kneel Down And Apologize People In Rajasthan Tour Details, Modi Kneel Down-TeluguStop.com

అందువలన ప్రధాని మాట్లాడుతూ నేను వచ్చేవరకు ఆలస్యం అయినందుకు నేను ఇప్పుడు మాట్లాడను మళ్ళీ కచ్చితంగా రాజస్థాన్ కి వస్తానని మోదీ తెలిపారు.అందుకని మోదీ మోకరిల్లి మరీ ప్రజలకు క్షమాపణ చెప్పారు.

ఈ నేపథ్యం లోనే మోదీ పై అశోక్‌ గెహ్లాట్‌ తన అక్కసు వెళ్లగక్కారు.ప్రధాని నరేంద్ర మోదీపై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ పెద్ద ఎత్తున మండిపడ్డారు.

మీరు నాకంటే గౌరవప్రదమైన వ్యక్తిగా చూపించుకోవాలనే ఇలా చేశారా అంటూ మండిపడ్డారు.తనకంటే వినయ వంతుడనని ప్రజల్లో మార్కులు కొట్టేయాలని ఇలా చేశారా అం‍టూ విమర్శించారు.అయినా ఆ సభలో ఇలా పాత కాలం నాటి ఫోజులు ప్రదర్శించకుండా ప్రజలకు సోదరభావం, ప్రేమ గురించి చక్కటి సందేశం ఇచ్చి ఉంటే బాగుండేదని అన్నారు.ఒకవేళ ఆయన అలా చేసి ఉంటే తానే స్వయంగా ఫోన్‌ చేసి అభినందించేవాడినని అన్నారు.

కానీ ఆయన తన సలహాలను పాటించరని, పైగా మోదీ ఇలా మూడుసార్లు మోకరిల్లడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారంటూ నిప్పులు చెరిగారు.అదీగాక రాజస్తాన్‌లోని ప్రజలకు అశోక్‌ గెహ్లాట్‌ అంటే చాలా గౌరప్రదమైన వ్యక్తిగా, సాదా సీదాగా ఉండే వ్యక్తి అని అందరికీ తెలుసని రాజస్థాన్ సీఎం వెల్లడించారు.చిన్న‍ప్పటీ నుంచి తనకు ప్రజల్లో ఇలాంటి ఇమేజే ఉందని, అందువల్ల మోదీ ఇక్కడ ఎలా పోటీ చేయగలరు అని ప్రశ్నించారు.బహుశా అందుకోసమే అనుకుంటా నాకంటే నమ్రత గా ఉండే వ్యక్తి గా పేరు తెచ్చుకునేందుకే ఇలా మోకరిల్లి ప్రజలకు క్షమాపణ చెప్పారాని ఎద్దేవా చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube