ఆచార్య రిజల్ట్ ను కొరటాలపై తోసేసిన మెగాస్టార్.. ఏం చెప్పారంటే?

చిరంజీవి గత సినిమా ఆచార్య ఏ రేంజ్ డిజాస్టర్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆచార్య రిజల్ట్ గురించి డైరెక్ట్ గా తొలిసారి స్పందించిన చిరంజీవి షాకింగ్ కామెంట్లు చేశారు.

 Chiranjeevi Shocking Comments About Acharya Result Details Here Goes Viral, Ac-TeluguStop.com

సినిమా రిజల్ట్ అనేది ఎప్పుడూ మన చేతుల్లోనే ఉండదని చిరంజీవి తెలిపారు.మన పనిలో మనం బెస్ట్ ఇస్తామని ఆయన కామెంట్లు చేశారు.

ఆచార్య సినిమా ఫ్లాప్ కావడం నన్ను అస్సలు బాధించలేదని చిరంజీవి తెలిపారు.

డైరెక్టర్ కొరటాల శివ చెప్పిందే మేము చేశామని చిరంజీవి కామెంట్లు చేశారు.

ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఉన్న ఒకే ఒక్క బాధ ఏమిటంటే నేను, చరణ్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటించినా ఈ సినిమా ఫ్లాపైందని ఆయన చెప్పుకొచ్చారు.ఆచార్య సినిమా హిట్ కాకపోవడంతో భవిష్యత్తులో నేను, చరణ్ కలిసి నటించినా ఈ స్థాయిలో జోష్ రాకపోవచ్చని చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం.

ఆచార్య సినిమా విషయంలో అంతకు మించి బాధేం లేదని చిరంజీవి తెలిపారు.అయితే ఆచార్య సినిమా ఫలితం గురించి కొరటాల శివ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు.

కొరటాల శివ కూడా స్పందిస్తే మాత్రమే ఆచార్య సినిమా రిజల్ట్ విషయంలో తప్పెవరిదో తేలే అవకాశం ఉంటుంది.గాడ్ ఫాదర్ మూవీ ఈవెంట్ ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఈ కామెంట్లు చేస్తున్నారు.

అయితే దర్శకుడు కొరటాల శివదే తప్పనే విధంగా చిరంజీవి కామెంట్లు చేయడంపై కొరటాల శివ అభిమానులు ఫీలవుతున్నారు.నాలుగు బ్లాక్ బస్టర్ హిట్లు తెరకెక్కించిన కొరటాల శివ ఆచార్య సినిమా విషయంలో ఎందుకు ఫెయిల్ అయ్యారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఆచార్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఉంటే దర్శకుడికే చిరంజీవి మొత్తం క్రెడిట్ ఇచ్చేవారా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube