నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో అన్ని పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి.హుజురాబాద్, దుబ్బాక ఫలితాలనే రిపీట్ చేసే ఆలోచనలో ఉన్న బీజేపీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుంది.
దీనిలో భాగంగానే మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ ప్రత్యేక సమావేశం చేపట్టింది.పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సల్ అధ్యక్షతన ఈ భేటీ జరుగుతుంది.
స్టీరింగ్ కమిటీ సభ్యులతో పాటు మండలాల ఇంఛార్జ్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.దీనిలో ప్రధానంగా ఉపఎన్నిక సన్నద్ధతపై ప్రధాన చర్చ జరుగుతోంది.