బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో వీక్ డేస్ లో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకోలేకపోయినా వీకెండ్స్ లో మాత్రం ఈ షోకు మంచి రేటింగ్స్ వస్తున్నాయనే సంగతి తెలిసిందే.ఈరోజు శనివారం కావడంతో నాగార్జున కంటెస్టెంట్లపై తనదైన శైలో ఫైర్ అయ్యారు.తాజాగా బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ కాగా ఏం పీకాంటూ ఆదిరెడ్డిపై నాగార్జున ఫైర్ అయ్యారు.119 సెకన్ల నిడివితో విడుదలైన ఈ ప్రోమోలో నాగార్జున బాలాదిత్యతో పాటు మరి కొందరు కంటెస్టెంట్ల ఫోటోలపై పంచ్ వేశారు.
బాలాదిత్యకు కోపం వచ్చిందని బాలాదిత్యకు కోపం రావడం ఎంత అద్భుతమో గలాటా గీతూకు దుఃఖం, బాధ రావడం అంతే అద్భుతమని నాగ్ అన్నారు.గలాటా గీతూ బాలాదిత్య తనతో ఒకటిన్నర రోజులు మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.
ఒకటిన్నర రోజులా అని బాలాదిత్య చెప్పగా అది బాధ పడే వాళ్లకు తెలుస్తుందే తప్ప నీకెలా తెలుస్తుందని నాగార్జున అన్నారు.అర్థం చేసుకోను అన్నవాళ్లకు ఏం చెబుతామని బాలాదిత్య కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
నువ్వు చాలా ఈజీగా కర్చు పెట్టేశావ్ అనిపించలేదా అని అర్జున్ కళ్యాణ్ ను అడగగా నేను కంటెండర్ గా పోటీ చేయలేనని భావించి అలా చేశానని అర్జున్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.ఫైమా అర్జున్ కళ్యాణ్ శ్రీసత్యకు 1000 రూపాయలు ఇచ్చారని చెప్పగా శ్రీసత్య వెంటనే చెయ్యి పైకి ఎత్తారు.
సూర్య అన్నం పారేయడం గురించి నాగ్ సీరియస్ అయ్యారు.నువ్వు పారేసిన అన్నం లేక ఎంతోమంది బాధ పడుతున్నారని నాగ్ చెప్పుకొచ్చారు.
ఫుడ్ విషయంలో ఏ పనిష్మంట్ ఇవ్వనని ఫుడ్ తక్కువగా ఉందని ఆదిరెడ్డి చెప్పాడని మరి ఈ వారం ఈ వారం ఆదిరెడ్డి ఏం పీకాడంటూ నాగ్ వార్నింగ్ ఇచ్చారు.ఈ ప్రోమోకు తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.ఆరోహి ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చాలామంది భావిస్తున్నారు.