తెలంగాణలో హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు కఠినతరం చేస్తున్నారు.ఈ మేరకు కొత్త రూల్స్ తీసుకువచ్చినట్లు తెలిపారు.
సిగ్నల్స్ దగ్గర వాహనాలు గీత దాటితే ఫైన్ ల మోత జరగనుంది.ఈ నిబంధనలు అక్టోబర్ 2 నుంచి అమల్లోకి రానున్నాయి.సిగ్నల్స్ దగ్గర స్టాఫ్ లైన్ దాటి ముందుకు వస్తే రూ.100 జరిమాానా విధిస్తున్నట్లు తెలిపారు.ఫ్రీ లెఫ్ట్ ను బ్లాక్ చేస్తే రూ.1000 జరిమానా, ఫుట్ పాత్ లపై దుకాణదారులు వస్తువులు పెట్టిన వారికి భారీ జరిమానా తప్పదని చెప్పారు.అదేవిధంగా పాదచారులకు ఆటంకం కలిగిలే వాహనాలు పార్కింగ్ చేసిన వారికి రూ.600 ఫైన్ తప్పదని అధికారులు హెచ్చరించారు.