డార్లింగ్ విందు భోజనం పెట్టడమేమో కానీ.. టాలీవుడ్ లో స్టార్ట్ అయిన వార్!

తాజాగా టాలీవుడ్ లో వింత సన్నివేశం చోటు చేసుకుంది.అందుకు కారణం ప్రభాస్ విందు భోజనం అనే చెప్పాలి.

 Prabhas Arranges Lunch For Fans In Mogalthuru, Mogalthuru,prabhas Arranges Lunch-TeluguStop.com

ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు గారి మరణం టాలీవుడ్ ను షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే.ఈయన మరణంతో ప్రభాస్ తో పాటు కుటుంబం కూడా పెద్ద దిక్కును కోల్పోయారు.

మరి అలాంటి పెద్ద నాన్న మరణంతో ప్రభాస్ ప్రస్తుతం క్రుంగి పోతున్నాడు.ఇప్పుడిప్పుడే కుటుంబం కోసం ఆయన తన బాధ నుండి బయట పడుతున్నాడు.

ఈయన సంస్కరణ సభ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం మొగల్తూరు లో భారీ ఎత్తున లంచ్ ఏర్పాటు చేసారు.నిన్నంతా ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

రకరకాల నాన్ వెజ్ వంటలతో అభిమానులకు కడుపునిండా భోజనం పెట్టి పంపారు ప్రభాస్.ఇక్కడి వరకు బాగానే ఉన్న ఇక్కడే వచ్చింది సమస్య.

ఈ సన్నివేశం కాస్త మిగతా హీరోలకు అంటించారు.దీంతో మెగా నందమూరి వార్ గా మారిపోయింది.

ఈ రెండు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు హోరాహోరీగా రచ్చ జరుగుతుంది.

డార్లింగ్ మంచి భోజనం పెట్టాడు.

కానీ మీ అభిమాన హీరో కోట్లు ఉంచుకుని కూడా మంచి నీళ్లు కూడా పోయలేదని ఒక వర్గం అభిమానులు ఆరోపిస్తే.మరి మీ హీరో ఏం చేసాడు? అని మరో హీరో ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తునాన్రు.ఇలా ఒకరిపై ఒకరు దూషించు కోవడం మొదలు పెట్టారు.మార్ఫింగ్ ఫోటోలు తయారు చేసి మరీ ఒకరిపై మరొకరు వాదోపవాదాలు చేసుకుంటూ సోషల్ మీడియాను వేడెక్కించారు.

Telugu Krishnam Raju, Mogalthuru, Prabhas, Prabhasarranges, Prabhas Fans, Tollyw

ప్రభాస్ విందు భోజనాలు ఏర్పాటు చేయడానికి ఈ హీరోలకు సంబంధం ఏంటో కానీ.ఈ ఇరు ఫ్యాన్స్ మధ్య మాత్రం ఈ సిల్లీ కామెంట్స్ వేడెక్కించేలా చేస్తున్నాయి.దీంతో మిగతా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి అర్ధం లేని వివాదాలు మానండి అంటూ చురకలు వేస్తున్నారు.ఒక హీరోపై అభిమానం ఉంటే మరో హీరోను కించపరచకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube