సాధారణంగా ఇండస్ట్రీలో నటులు ఎప్పుడు ఎన్నో పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు.కానీ తమ కెరియర్లో మలుపు తిప్పే పాత్రలు మాత్రం కొన్నే ఉంటాయి అని చెప్పాలి.మరి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది నటుల కెరియర్ లో మలుపు తిప్పిన పాత్రలు ఏంటో తెలుసుకుందాం.
ప్రకాష్ రాజ్ :
తాను చేస్తున్న పాత్రలు నచ్చక కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు.కానీ ఆ తర్వాత అంతపురం అనే సినిమాతో మాత్రం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు ప్రకాష్ రాజు.పాత్రకు ఉండే సీమ మాడలికం ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.ఈ పాత్ర ప్రకాష్ రాజ్ కెరియర్ కు బ్రేక్ ఇచ్చింది./br>

శ్రీహరి :
ఇండస్ట్రీలో రియల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు.అయితే శ్రీహరి కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ పాత్రలో కూడా నటించి మెప్పించాడు అన్న విషయం తెలిసిందే.అయితే శ్రీహరి విలన్ పాత్రలు చేస్తున్న సమయంలో నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాల్లో కెరియర్ లోనే ఒక పాజిటివ్ రోల్ చేశారు.
ఇది శ్రీహరి కెరియర్ లో మైలరాయిగా మిగిలిపోయింది.
జగపతిబాబు : సెకండ్ ఇన్నింగ్స్ లో నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో లెజెండ్ సినిమాలో జితేంద్ర అనే క్యారెక్టర్ జగపతిబాబుకి దక్కింది.తర్వాత కెరియర్ మారిపోయింది.

మహేష్ బాబు :
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మహేష్ బాబు మొదటి సినిమా రాజకుమారుడు నుండి ఒక్కడు పెద్ద హిట్లు అందుకోలేకపోయాడు.మూడు క్లాస్ సినిమాల తర్వాత నిరాశలో మునిగిపోయాడు.ఇలాంటి సమయంలో ఒక్కడు సినిమాతో సూపర్ హిట్ అందుకుని మాస్ ఆడియన్స్ అందరికీ కూడా దగ్గరయ్యాడు.
ఆ తర్వాత మహేష్ బాబు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పాలి.

విజయ్ దేవరకొండ :
అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిన్న హీరోగా ఉన్న విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి సినిమాలోని అర్జున్ పాత్ర ఎంత క్రేజ్ తీసుకొచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక విజయ్ కెరియర్ ఒక్కసారిగా మారిపోవడానికి ఈ పాత్ర కారణం అని చెప్పాలి.
ఆది పినిశెట్టి :
తెలుగు దర్శకుడు రవిరాజ పినిశెట్టి అబ్బాయిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిశ్రమమైన ఆది పినిశెట్టి తమిళంలో హీరోగా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ న్యూను ఢీకొట్టే పాత్రలో నటించాడు.ఈ పాత్ర ఆది పిని శెట్టి కెరీయర్ని మలుపు తిప్పింది అని చెప్పాలి.







