పీఎఫ్ఐ సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం దృష్టి సారించింది.పీఎఫ్ఐ బ్యాన్ అనంతరం సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు దర్శనమిస్తున్నాయి.
ఈ క్రమంలో పోస్టులను నిఘా వర్గాలు పరిశీలిస్తున్నాయి.పీఎఫ్ఐ స్టేట్ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేశారు అధికారులు.
కర్ణాటక, కేరళ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర పీఎఫ్ఐ ట్విట్టర్ అకౌంట్లను కేంద్రం బ్లాక్ చేసింది.అదేవిధంగా కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని పీఎఫ్ఐ కార్యాలయాలను సీజ్ చేశారు.