అమెరికా పర్యాటక వీసాల జారీ విషయంలో భారత్ కు మొండి చెయ్యి చూపుతూ చైనా, పాక్ లను చంకనెత్తుకుంటోందనే విషయంపై గడిచిన కొంత కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి.పర్యాటక వీసాల జారీ ప్రక్రియలో దేశాల మధ్య వ్యత్యాసం చాలా వ్యత్యాసం కనిపిస్తోంది.
మరీ ఎంత దారుణంగా అంటే భారతీయులు పర్యాటక వీసా పొందాలంటే సుమారు రెండేళ్ళ పాటు వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడగా అదే చైనా, పాక్ వారికి మాత్రం కేవలం 24 గంటలు లేదా రెండు రోజుల సమయం మాత్రమే పడుతుండటం గమనార్హం.
ఢిల్లీ వాసులు గనుకా పర్యాటక వీసా పొందాలంటే సుమారు 833 రోజులు వేచి చూడాల్సి వస్తోందట.
అలాగే ముంబై వాసులు పర్యాటక వీసా పొందాలంటే 848 రోజులు వేచి చూడాల్సి వస్తుందని అమెరికా అధికారిక వెబ్సైటు లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు నిపుణులు.అదే బీజింగ్ వారికి ఇదే వీసా జారీ కేవలం రెండు రోజుల్లో అవుతోందని ఇస్లామా బాద్ వాసులకు 420 రోజులు పడుతోందని, అంటున్నారు.
భారత్ అయితే 800 రోజులపైనే ఉండాలని, చైనా కు మాత్రం 2 రోజులు ఏంటని మండిపడుతున్నారు.ఇదిలాఉంటే.

విద్యార్ధి వీసాల జారీ విషయంలో కూడా భారత్ కు తీవ్ర నష్టం జరుగుతోందట.విద్యార్ధి వీసాల కోసం వెయిటింగ్ సమయం ఢిల్లీ, ముంబై వారికైతే 450 రోజులు ఉండగా పాక్ విద్యార్ధులకు వెయిటింగ్ సమయం మాత్రం కేవలం 1 రోజని, చైనా వారికి మాత్రం ఈ సమయం 2 రోజులని ఈ విషయంలో కూడా భారత్ కు మొండి చెయ్యి చూపుతున్నారని తెలుస్తోంది.తాజాగా ఈ విషయంపై భారత్ విదేశాంగ మంత్రి జై శంకర్ అమెరికాతో జరిగిన చర్చలలో ప్రస్తావించగా కరోనా తరువాత సిబ్బంది లేమితో కొన్ని ప్రాంతాలలో వీసాల జారీలో సమయం పడుతోందని ఇకపై అలాంటి వ్యత్యాసం లేకుండా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.







