యాదాద్రి జిల్లా:నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం చేసుకొని జాతీయ పార్టీకి సంబంధించి ప్రత్యేక పూజలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ఉదయం 10:30 గంటలకు ప్రగతి భవన్ నుండి బేగంపేటకు వరకు రోడ్డు మార్గంలో వెళ్లి,అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్లో 11:30 గంటలకు యాదాద్రి చేరుకుంటారని సమాచారం.శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దర్శనం అనంతరం ఆలయ పనులపై కూడా సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.యాదాద్రి నుండి నేరుగా వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.







