తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటించనున్నారు.ఉదయం 11 గంటలకు యాదాద్రి చేరుకోనున్న ఆయన.
జాతీయ పార్టీ ప్రకటన నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోనున్నారు.యాదాద్రి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం ప్రధానాలయ దివ్య విమాన గోపురానికి బంగారం వితరణ చేయనున్నారు.బంగారం తాపడం కోసం తన కుటుంబం తరఫున కిలో 16 తులాల బంగారం స్వామివారికి కానుకగా ఇవ్వనున్నారు.
ఈ బంగారాన్ని కేసీఆర్ నేడు వైటీడీఏ అధికారులకు అందించనున్నారు.సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.







