బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన స్వాతిముత్యం అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా అక్టోబర్ 5 న రావడం వల్ల భారీ పబ్లిసిటీ దక్కింది.
కారణం ఏంటి అంటే.అదే రోజు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల కాబోతుంది.
అంతే కాకుండా టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా రాబోతుంది.ఆ రెండు సినిమాలకు పోటీ అన్నట్లుగా స్వాతిముత్యం సినిమాతో బెల్లంకొండ సాయి గణేష్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఇద్దరు స్టార్ హీరోలతో పోటీగా ఒక చిన్న హీరో.అది కూడా తన మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం అనేది చాలా పెద్ద సాహస నిర్ణయం విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.
స్టార్ హీరోలతో పోటీ పడి మరి సినిమాను తీసుకు రాబోతున్నాడు అంటూ బెల్లంకొండ సాయి గణేష్ సినిమా స్వాతిముత్యం గురించి ప్రతి రోజు మీడియాలో పెద్ద ఎత్తైన ప్రచారం జరుగుతుంది, పైగా సినిమాకు సంబంధించిన పోస్టర్స్ ప్రమోషన్ విజువల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.ముఖ్యంగా ట్రైలర్ చూసిన తర్వాత సినిమాలో మ్యాటర్ ఉండేలా ఉందే అనిపిస్తుంది.
ఎప్పటికప్పుడు సినిమా గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.కనుక మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఆ కారణంగానే స్వాతిముత్యం సినిమా లక్కీ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించాడు, దసరాకు రాబోతున్న ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటూ గాడ్ ఫాదర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడ్డం సినిమా స్థాయిని మరింతగా పెంచింది.మరి స్వాతిముత్యం స్థాయికి తగ్గట్లుగా ఆకట్టుకుని భారీ వసూళ్లను నమోదు చేస్తుందేమో చూడాలి.







