టీ20 సిరీస్ లో భాగంగా దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది.తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో గెలుపొందింది.ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.16.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్ విజయాన్ని అందుకుంది.అర్షదీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఈ విజయంతో భారత్ 1-0తో సిరీస్‌లో ముందంజలో ఉంది.ఈ రెండు జట్ల మధ్య అక్టోబర్ 2న గుహవాటి వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.







