తక్కువ సమయంలో ముగ్గురు ఆత్మీయులను కోల్పోయిన కృష్ణ... గుండె తరుక్కుపోతుంది !

మహేష్ బాబు కి మాతృ వియోగం కలిగింది.సూపర్ స్టార్ కృష్ణ మొదటి భార్య ఇందిరా బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

 Super Star Krishna Lost His 3 Family Members In Less Time Details, Indira Devi,-TeluguStop.com

కృష్ణ భార్య కంటే కూడా మహేష్ బాబు తల్లిగానే మీడియా చేత ఎక్కువగా పిలవబడ్డారు ఇందిర దేవి.కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిపాలైన ఇందిరా కన్నుమూయడంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.

ఇందిరకి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు వారే మహేష్ బాబు, రమేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఎంతమంది ఉన్నా కూడా ఆమె ఎప్పుడు ఒంటరిగానే ఉండేది.

కృష్ణ తన కోసం కట్టించిన ఇంట్లోనే తన చివరి శ్వాస వరకు జీవించింది ఇందిరా దేవి.

ఇందిరా మృత దేహం చుసిన మహేష్ బాబుని ఆపడం ఎవరి తరం కావట్లేదు.

కృష్ణ మరియు ఇందిరాలకు 1962 నవంబర్ 1 న పెళ్లి జరిగింది.వీరిద్దరికీ పెళ్లికి ముందే చుట్టూ ఉండడంతో వీరికి పెద్దలు పెళ్లి చేశారు.

సరిగ్గా ఏడేళ్ల తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్న కృష్ణ మరోమారు విజయనిర్మలతో ప్రేమలో పడి 1969లో పెళ్లి చేసుకున్నాడు.పెళ్లి అయిన తర్వాత కూడా ఇందిరతో వైవాహిక జీవితాన్ని కొనసాగించి మరో ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు కృష్ణ.

అయితే భార్య మరణంతో ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ తీవ్ర విషాదంలో ఉన్నాడు.అంతే కాదు ఇంట్లో వరస మరణాలు ఆయనను కృంగదీస్తున్నాయి.

Telugu Ghattamaneni, Indira Devi, Krishna, Krishna Indian, Mahesh Babu, Vijaya N

మొదట 2019 లో తాను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయనిర్మల అనారోగ్య కారణాలతో మృతి చెందింది.విజయనిర్మల, కృష్ణ చివరి వరకు కలిసి ఉన్నారు.ప్రస్తుతం కృష్ణ ఆమెతో కలిసి జీవించిన ఇంట్లోనే తన చివరి రోజులు గడుపుతున్నాడు.అప్పటినుంచి కోలుకోకుండా ఉన్న కృష్ణకి మరొక షాక్ తగిలింది.జనవరి 8వ తారీకు 2022 వ సంవత్సరంలో కృష్ణా తన పెద్ద కుమారుడు అయినా రమేష్ బాబుని కోల్పోయాడు.రమేష్ బాబు సైతం కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు.

Telugu Ghattamaneni, Indira Devi, Krishna, Krishna Indian, Mahesh Babu, Vijaya N

ఆ తర్వాత అనేక అనారోగ్య కారణాలతో కన్నుమూశాడు.కృష్ణ మరియు ఇందిర లు ఇద్దరు కూడా పుత్రశోకంతో తల్లడిల్లారు.సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత ఇప్పుడు తన జీవిత భాగస్వామి, తన ఐదుగురు పిల్లల తల్లి అయినా ఇందిరిని సైతం కృష్ణ కోల్పోయాడు.అతి తక్కువ సమయంలో ఇలా తన కుటుంబలో ముగ్గురిని కోల్పోయిన కృష్ణను చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోవాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube