చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ అసత్య ప్రచారాలకు పుల్ స్టాప్ పెట్టారు.దాదాపు పది రోజుల తర్వాత బయట ప్రపంచానికి కనిపించారు.
ఉజ్జెకిస్తాన్ పర్యటన తర్వాత జిన్ పింగ్ తొలిసారిగా బయటకు వచ్చారు.బీజింగ్ లో నిర్వహించిన ఓ ఎగ్జిబిషన్ కు ఆయన వచ్చారు.
ఈ విషయాన్ని స్వయంగా చైనా ప్రభుత్వ మీడియా సంస్థ అధికారికంగా ప్రకటించింది.దీంతో ఇన్ని రోజులుగా వస్తున్న పలు రకాల ఊహాగానాలకు చెక్ పడిందని చెప్పుకోవచ్చు.
అయితే, చైనా కరోనా ప్రోటోకాల్ ఎంతో కఠినంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో జిన్ పింగ్ ఐసోలేషన్ నిబంధనలను పక్కాగా పాటించారు.7 రోజులపాటు విదేశాల్లోని హోటల్ లో, తర్వాత 3 రోజుల పాటు ఇంటిలో ఐసోలేషన్ లో గడిపినట్లు సమాచారం.







