అనంతపురం జిల్లా ధర్మపురం వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సచివాలయం వాలంటీర్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.వాలంటీర్లను చెప్పుతో కొడతానని హెచ్చరించారంటూ ఎమ్మెల్యే వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది.
నియోజకవర్గంలో కొన్ని వార్డుల్లో కొందరు వాలంటీర్లు పెన్షన్ విషయంలో కరప్షన్ కు పాల్పడుతున్నారని తనకు ఫిర్యాదులు రాగా.తన వద్దకు వచ్చిన ఫిర్యాదులుకు ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు.
ఇలాంటి కరప్షన్స్ కి పాల్పడ్డ వారు ఎవరైనా గాని జనాల్లోకి వెళ్లి తిరిగి వాళ్ల సొమ్ము వాళ్లకి ఇవ్వాలని లేదంటే రోడ్డు మీదకు లాగి చెప్పుతో కొడతానని ఎమ్మెల్యే కేతిరెడ్డి అన్నట్టు,సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది…







