హైదరాబాద్‌లో జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియాపై విజయన్ని సాధించిన భారత్ మరో సిరీస్‌ను కైవసం చేసుకుంది.టీ20 ప్రపంచకప్ 2021 నుండి భారత్ ఇప్పటివరకు ఒక్క ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను కూడా ఓడిపోలేదు.రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఆసియాకప్ ను గెలవలేకపోయింది.కానీ మిగతా అన్ని సిరీస్లను భారత్ గెలిచింది.తాజాగా ఐసీసీ మెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ ర్యాంకింగ్ పాయింట్లు పెరిగాయి.దీంతో నంబర్ 1 స్థానం మరింత పటిష్టమైంది.
అయితే ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా, భారత్‌తో సిరీస్ ఓడిపోయిన తర్వాత ఒక పాయింట్‌ను కోల్పోయిన్నప్పటికీ ఆస్ట్రేలియా స్థానంలో మార్పు లేదు.
ఈ సిరీస్ విజయం తర్వాత భారత్ ఓవరాల్‌గా 268పాయింట్లతో నంబర్ 1 ర్యాంకులో ఉంది.261పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది.దక్షిణాఫ్రికా 3వ స్థానంలో, పాకిస్తాన్ 4వ స్థానంలో ఉన్నాయి.5వ స్థానంలో న్యూజిలాండ్, 7వ స్థానంలో వెస్టిండీస్, 8వ స్థానంలో శ్రీలంక, 9వ స్థానంలో బంగ్లాదేశ్, 10వ స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.సెప్టెంబర్ 28నుంచి దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఆడబోతుంది.
భారత్ స్వదేశంలో మరో సిరీస్ విజయంతో పూర్తి చేయగలిగితే, నంబర్ 1 ర్యాంకు టీ20 జట్టుగా ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచకప్ – 2022లోకి భారత్ అడుగుపెట్టే అవకాశం ఉంది.

అయితే సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగి ఆడడంతో భారత్ డిసైడర్ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.కెప్టెన్ రోహిత్ శర్మ చివరి మ్యాచ్ గెలిచాక మాట్లాడుతూ,హైదరాబాద్ కు నాకు చాలా మంచి అనుబంధం ఉంది.టీమిండియా తరఫున, అలాగే డెక్కన్ ఛార్జర్స్ తరఫున చాలా జ్ఞాపకాలను ఇక్కడ కలిగి ఉన్నాం.
మేము మంచి ప్రదర్శన ఇవ్వాలనుకున్నాం.మేము అనుకున్నట్లే సరిగ్గా మా ప్రణాళికలను అమలు చేశాం అని రోహిత్ వెల్లడించాడు.







