నేడు పంజాబ్లో ఆప్ ప్రభుత్వం బలనిరూపణ జరగనుంది.ఈ నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ అనుమతి ఇచ్చారు.
కేంద్రంలోని బీజేపీ తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోందని ఆప్ కొన్ని రోజులుగా ఆరోపిస్తోంది.ఈ క్రమంలోనే తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధమైన ఆప్.ఈనెల 22న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ను కోరింది.ఈ మేరకు కేబినెట్ కూడా తీర్మానం చేసింది.
అయితే, ఈ తీర్మానంలో నిబంధనలు పాటించలేదని అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ ఆమోదం నిరాకరించిన విషయం తెలిసిందే.







