పొటాటో లేదా బంగాళదుంప..
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో ఇది ఒకటి.బంగాళదుంప రుచి పరంగానే కాదు పోషకాల పరంగానూ అమోఘం అనే చెప్పవచ్చు.
అయితే చర్మ సౌందర్యానికి కూడా బంగాళదుంప ఎంతగానో మేలు చేస్తుంది.వివిధ రకాల చర్మ సమస్యలను దూరం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
ముఖ్యంగా పొటాటోతో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేస్ జెల్‌ను తయారు చేసుకుని రోజు వాడితే గనుక బోలెడన్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్ తమ సొంతం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం పొటాటో ఫేస్ జెల్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక పెద్ద బంగాళదుంపను తీసుకుని తొక్క చెక్కేసి నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన బంగాళదుంపను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తరువాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.
ఇలా ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను నీటితో సహా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అలోవెరా జెల్ వేసుకోవాలి.
అలాగే అందులో రెండు టేబుల్ స్పూన్ల పొటాటో జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు చుక్కలు రోజ్ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని స్పూన్‌తో నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుంటే పొటాటో ఫేస్ జెల్ సిద్ధమవుతుంది.

ఈ ఫేస్ జెల్ ను ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ముఖం మొత్తానికి ఈ జెల్‌ను అప్లై చేసుకుని పడుకోవాలి.ప్రతిరోజు ఈ జెల్‌ను కనుక వాడితే ముఖంపై మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.
కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ దూరం అవుతాయి.చర్మం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది.
ముడతలు, సన్నని చారలు వంటి వృద్ధాప్య లక్షణాలు సైతం త్వరగా దరిచేరకుండా ఉంటాయి.







