మరోసారి బయటపడిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం

హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్లక్ష్యం మరోసారి బయటపడింది.భారత్ -ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్లపై టైమ్ ను తప్పుగా ముద్రించిన విషయం వెలుగులోకి వచ్చింది.

 The Negligence Of The Hyderabad Cricket Association Has Been Exposed Once Again-TeluguStop.com

ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుండగా.టికెట్స్ పై 7.30 గంటలకు మొదలవుతుందని పేర్కొంది.ఈ మ్యాచ్ విషయంలో ముందు నుంచీ హెచ్ సీఏ వైఖరిపై చాలా విమర్శలు వస్తున్నాయి.టీ20కి సంబంధించి 39వేల టికెట్లు ఉంటే సాధారణ ప్రజలకు అందులో సగం కూడా అందుబాటులో ఉంచలేదనే వాదనలు ఉన్నాయి.ఆఫ్ లైన్ లో కేవలం వేల టికెట్లను మాత్రమే అమ్మింది.

ఇంకోవైపు మ్యాచ్ కు సమయం దగ్గర పడుతున్నా స్టేడియంలో ఏర్పాట్ల పట్ల ఉదాసీనంగా వ్యవహరించారన్న విమర్శలూ ఉన్నాయి.ఉప్పల్ స్టేడియంలో దుమ్మూ, దూళి, పక్షుల వ్యర్థాలతో నిండిన సీట్లను సరిగ్గా శుభ్రం చేయలేదంటూ సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube