దివ్యాంగులకు గుడ్ న్యూస్ అందించిన ఇస్రో.. కృత్రిమ కాలు తయారీ..!

సాధారణంగా మోకాలి కింది నుంచి కాలు అనేది పాడైపోతే దాని స్థానంలో ఒక మోకాలు అమర్చుకుంటారు.అయితే డబ్బులు ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే మార్కెట్లో ఒక్క ఆర్టిఫిషియల్ లింబ్ రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల ధరలు పలుకుతోంది.అయితే ఈ కృత్రిమమైన మోకాలును చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధమయ్యింది.ఇందులో భాగంగా ఇప్పటికే మైక్రో ప్రాసెసర్‌తో నడిచే ఓ కృత్రిమ మోకాలిని అభివృద్ధి చేసింది.

 Isro Has Given Good News To The Disabled Artificial Leg Manufacturing,artificial-TeluguStop.com

కాగా దీని కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభం కావాల్సి ఉంది.అదే జరిగితే రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ధర లోపు కృత్రిమ మోకాలు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది.

కృత్రిమ మోకాలను మైక్రో ప్రాసెసర్ కంట్రోలర్ మోకాలు (ఎంపీకే) అని ఇస్రో పేరు పెట్టింది.చాలా లైట్ వెయిట్ గా ఉండే ఈ ఆర్టిఫిషియల్ లింబ్ జస్ట్ 1.6 కేజీలు అని ఇస్రో వెల్లడించింది.కాళ్లు లేని దివ్యాంగులకు ఈ ఎంపీకే పరికరం ఎంతగానో హెల్ప్ అవుతుందని ఇస్రో తెలిపింది.

అంతేకాదు, మార్కెట్లోని కృత్రిమ అవయవాలతో కంపేర్ చేస్తే ఈ ఎలక్ట్రానిక్ మోకాలు ధర 10 రేట్లు చౌక అని ఇస్రో పేర్కొంది.దీని సహాయంతో దివ్యాంగులు 100 మీటర్ల మేర ఎలాంటి సపోర్ట్ లేకుండా నడవగలుగుతారు అని ఇస్రో చెబుతోంది.

ఫలితంగా నడవాలనే దివ్యాంగుల కల నిజం అవుతుంది.

ఈ ఎంపీకేలో మైక్రోప్రాసెసర్, హైడ్రాలిక్ డంపర్, లోడ్, మోకాలి యాంగిల్ సెన్సార్లు, కాంపోజిట్ నీ-కేస్, లి-అయాన్ బ్యాటరీ, ఎలక్ట్రికల్ జీను, ఇంటర్‌ఫేస్ ఎలిమెంట్స్ ఉంటాయి.

వీటన్నిటి సహాయంతో ఆ ఆర్టిఫిషియల్ మోకాలు దివ్యాంగులు నడుస్తున్నప్పుడు మంచి అనుభూతిని అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube