ఏపీ విభజన జరిగి ఏడేళ్ళు అవుతున్న ఇంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై స్పష్టత లేదు.అమరావతి ఒక్కటే ఏపీకి రాజధాని అని తెలుగుదేశం అంటుంటే.
వైసీపీ మాత్రం మూడు రాజధానులు అనే ప్రతిపాదనను తీసుకోచ్చింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏది ఉండాలి? అనేది ఎవరికి స్పష్టత లేకుండా పోయింది.రాజధాని అంశం ఇప్పుడు రాజకీయ నాయకులకు ఆట వస్తువుగా మారిపోయింది.అమరావతి ఏ రకంగా సాధ్యం కానీ ప్రాజెక్టు అంటూ లెక్కలతో సహా జగన్ శాసనసభ సాక్షిగా వివరించారు.
అమరావతే ఏపీకి సరైనా రాజధాని అని సులభంగా నిర్మించుకునే అమరావతిని వైసీపీ క్లిష్టమైన అంశంగా మార్చిందని టీడీపీ వాదిస్తుంది.ఇక అమరావతిని క్యాపిటల్‌గా ఉంచాలని రాజధాని రైతులు రోజుల తరబడి ఆందోళనలు చేస్తునే ఉన్నారు.
అయితే తాజాగా ఏపీలో కొత్త వాదన వినిపిస్తుంది.వైసీపీ మూడు రాజధానుల్లా.
ఏపీలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు ఖాయమని అంటున్నారు.ఇందుకు తగ్గట్టుగా టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధన్యతను సంతరించుకున్నాయి.
కేవలం కులం, మతం పేరుతో రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా? ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం వస్తుందని ఏపీ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు.ఒక్కవేళ ఏపీలో మూడు రాజధానులు కనుక పేడితే.
రాష్ట్రం మూడు ముక్కలు అవడం ఖాయమని కొందరూ ఆరోపిస్తున్నారు.

మూడు రాజధానుల్లో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తే.అది ప్రాధన్యత లేని రాజధానిగా ఉంటుందని, హైకోర్టు ఉన్నంత మాత్రనా ఒరిగేది ఏం ఉండదని.దీంతో కర్నూల్ రాజధానిగా గ్రేటర్ రాయలసీమ ఉద్యమం తలెత్తుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇలానే విశాఖ, అమరావతి వేదికగా ఉద్యమాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.దీంతో ఏపీ మూడు ముక్కలు కాక తప్పదని వాదిస్తున్నారు.
ఇదే గనుక జరిగితే వైసీపీ మూడు రాష్ట్రాలు అనే అంశాన్ని కూడా తెరపైకి తీసుకోస్తుందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు
.






