మణిరత్నం డైరక్షన్ లో దశాబ్ధ కాలం నాటి కలని తెర మీదకు తీసుకొచ్చాడు.ఓ నవల ఆధారంగా సినిమా చేయాలని అనుకోవడం అది కూడా చారిత్రక మూలాలున్న కథతో సినిమా తీయడం అనేది సాహసమనే చెప్పాలి.
ఈ క్రమంలో పొన్నియిన్ సెల్వన్ సినిమాకు మణిరత్నం బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న సందర్భంగా అన్ని చోట్ల ప్రమోషన్స్ చేస్తున్నారు.
సినిమాకు పనిచేసిన మొత్తం కాస్టింగ్ ఈ ప్రమోషన్స్ లో కనిపిస్తున్నారు.అయితే అందరిలో కన్నా అందాల భామ త్రిష కెమెరాలకు హైలెట్ అవుతుంది.రెండు దశాబ్ధాల క్రితం తెరకు పరిచయమైన త్రిష ఇప్పటికీ అంతే గ్లామర్ గా.తన క్రేజీ లుక్స్ తో ఆకట్టుకుంటుంది.త్రిష అంటే తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకమైన అభిమానం.అందుకే ఆమెని చూడగానే ఇక్కడ ప్రేక్షకులు కేకలు వేస్తున్నారు.ప్రస్తుతం త్రిష పి.ఎస్ 1 ప్రమోషన్స్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ పక్క ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ ఉన్నా సరే ఆమె కన్నా త్రిష మీదే మీడియా ఎక్కువ ఫోకస్ చేస్తుంది.సో త్రిష ఇంకా మరిన్ని సినిమాలు చేయొచ్చని ఆమె లుక్స్ చూస్తే అర్ధమవుతుంది.







